బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి సొంతం చేసుకున్న నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ లవ్ స్టొరీ ఫస్ట్ డే మీడియం రేంజ్ హీరోల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపనర్ గా నిలవగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు బాగుంటే ఇంకా కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండి ఉండేవి, అయినా కానీ అవరోధాలను తట్టుకుని సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో…
10.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 16.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది… ఇక రెండో రోజు సినిమా కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో తిరిగి గ్రోత్ ని చూపెట్టిన ఈ సినిమా…
ఇప్పుడు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే $700K డాలర్స్ మార్క్ ని అందుకుని 1 మిలియన్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండగా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని…
అందుకోవడం కన్ఫాం గా తెలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా రెండో రోజు 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు. దాంతో సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 23.5 కోట్ల నుండి 24 కోట్ల మార్క్ ని మినిమం అందుకునేలా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు అన్నీ అనుకూలంగా ఉంటే సినిమా…
24 కోట్ల నుండి 25 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా తొలి రెండు రోజుల్లో సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేయడం తో ఇక ఆదివారం కలెక్షన్స్ ఇంకాస్త జోరు పెంచితే సెన్సేషనల్ వీకెండ్ ని పూర్తీ చేసుకోవచ్చు. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.