Home న్యూస్ 2.5 కోట్ల టార్గెట్…2 రోజుల్లో వచ్చింది ఇది!!…సంపూ వీరంగం ఇది!!

2.5 కోట్ల టార్గెట్…2 రోజుల్లో వచ్చింది ఇది!!…సంపూ వీరంగం ఇది!!

1232
0

     సంపూర్నేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల వీకెండ్ ని పూర్తి చేసు కుంది, మొదటి రోజు సినిమా మొత్తం మీద 62 లక్షల దాకా షేర్ ని అందుకోగా రెండో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందు కుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా రెండో రోజు ను ముగించి అద్బుతంగా హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది.

సినిమా రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్ళ ని సాధించడం విశేషం అని చెప్పాలి, ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో 54 లక్షల షేర్ రాగా రెండో రోజు ఏకంగా 63 లక్షల షేర్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా రెండో రోజు 71 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో రెండు రోజులు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 1.17 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 1.33 కోట్ల షేర్ ని అందుకుంది, కాగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 2.2 కోట్ల దాకా ఉందని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ను మొత్తం మీద…

2 కోట్ల రేంజ్ లో అమ్మగా 2.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా సగం టార్గెట్ ని 2 రోజుల్లోనే సాధించింది, ఇక మూడో రోజు కూడా బక్రీద్ హాలిడే ఉండటం తో సినిమా మరో సారి జోరు చూపే అవకాశం ఉండటం తో ఈ రోజుతో బిజినెస్ చాలా వరకు రికవరీ అయ్యే అవకాశం ఉంది.

దాంతో మొదటి వారం ముగియక ముందే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ జోన్ లో ఎంటర్ అవ్వడమే కాదు ప్రాఫిట్స్ లో కూడా జోరు చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here