Home న్యూస్ 8.5 కోట్ల టార్గెట్….2 రోజుల్లో మాస్టర్ కి వచ్చింది ఇది!!….మాస్!!

8.5 కోట్ల టార్గెట్….2 రోజుల్లో మాస్టర్ కి వచ్చింది ఇది!!….మాస్!!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అన్నీ మించేసి కలెక్షన్స్ పరంగా డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ రెండో రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో స్ట్రాంగ్ గానే హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధించింది. మిగిలిన సినిమాల తో పోల్చితే మాస్టర్ సినిమా కి రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర… తక్కువ థియేటర్స్ దక్కగా…

అయినా కానీ డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుంది మాస్టర్ సినిమా.. సినిమా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో 2 వ రోజు సాధిస్తుంది అని అంచనా వేయగా సినిమా 1.67 కోట్ల షేర్ ని రాబట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు మాస్టర్ సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 44L
👉Ceeded: 35L
👉UA: 21L
👉East: 16L
👉West: 13.2L
👉Guntur: 14L
👉Krishna: 15.1L
👉Nellore: 9L
AP-TG Total:- 1.67CR (2.75Cr Gross~)
2.75 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని స్ట్రాంగ్ గానే హోల్డ్ చేసి సత్తా చాటుకుంది.

ఇక సినిమా టోటల్ గా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 7.68 కోట్ల షేర్ ని 13.15 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఏరియాల వారి షేర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 2.18Cr
👉Ceeded: 1.47Cr
👉UA: 1.04Cr
👉East: 64L
👉West: 69L
👉Guntur: 80L
👉Krishna: 51L
👉Nellore: 35L
AP-TG Total:- 7.68CR (13.15Cr Gross~)
మొదటి రోజు సాధించిన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పోల్చితే రెండో రోజు సినిమా డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ థియేటర్స్ కూడా తక్కువే కాబట్టి బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి.

Master 2 Days Telugu Collections

ఇక సినిమాను తెలుగు టోటల్ గా 8 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 8.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇప్పుడు మరో 82 లక్షల షేర్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, మూడో రోజు కలెక్షన్స్ తో సినిమా ఈ మార్క్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

Master First Day Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here