T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

అమ్మింది 2.2 కోట్లకు…2 రోజుల్లో వచ్చింది ఇది!!



     కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పహిల్వాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యింది, సినిమా కి అటు మరీ పాజిటివ్ టాక్ రాలేదు ఇటు మరీ నెగటివ్ టాక్ రాలేదు… యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారికి ఒకసారి నచ్చే విధంగా సినిమా ఉంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 360 వరకు థియేటర్స్ లో ఘనంగా నే రిలీజ్ అయ్యింది కానీ

ఓపెనింగ్స్ మాత్రం చాలా నీరసంగా వచ్చాయి. తెలుగు లో పేరున్న పెద్దగా మార్కెట్ లేకపోవడం తో సినిమా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. మొదటి రోజు పహిల్వాన్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 27 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది.

ఇక రెండో రోజు కూడా ఏమాత్రం గ్రోత్ లేకుండా 20 లక్షల లోపు షేర్ తోనే సరిపెట్టుకుంది. దాంతో మొత్తం మీద 2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 47 లక్షల షేర్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. సినిమా ను తెలుగు లో 2.2 కోట్లకు అమ్మారు. దాంతో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే… మినిమమ్ 2.8 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

కాగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 2.27 కోట్ల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా కన్నడ మరియు మిగిలిన చోట్ల వసూళ్ళు క్లియర్ గా తెలియాల్సి ఉంది. హిందీ లో 2 రోజుల్లో 4 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుందట ఈ సినిమా.

మొత్తం మీద 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 15 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని ఈ సినిమా అందుకుందని అంచనా వేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో బిజినెస్ ని అందుకోవాలి అంటే ఆదివారం చాలా సాలిడ్ గా సినిమా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. మరి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE