Home న్యూస్ 2nd డే…2.2 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది…అల్టిమేట్ ఇది!!

2nd డే…2.2 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది…అల్టిమేట్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే మొదటి రోజు మంచి వసూళ్ళనే సొంతం చేసుకున్నా మొత్తం మీద అవి అంచనాలను అందుకునే రేంజ్ లో అయితే లేవు. దాంతో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా బాగానే హోల్డ్ చేయడం తో రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా….

2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు అనుకున్నా కానీ ఓవరాల్ గా సినిమా రెండో రోజు 2.54 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసింది, కాగా మొదటి రోజు వర్త్ షేర్ 3.65 కోట్లు కాగా అందులో నుండి…

రెండో రోజు మొత్తం మీద సినిమా 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఇది మంచి హోల్డ్ గా చెప్పుకోవాలి, కానీ ఓవరాల్ గా సినిమా బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రకారం చూసుకుంటే మట్టుకు సినిమా ఇంకా బాగా హోల్డ్ చేసి కలెక్షన్స్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక సినిమా మొత్తం మీద రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
👉Nizam: 2.67Cr
👉Ceeded: 93L
👉UA: 92L
👉East: 68L
👉West: 41L
👉Guntur: 85L
👉Krishna: 37L
👉Nellore: 33L
AP-TG Total:- 7.16CR (10.81Cr~ Gross)
KA+ROI: 45L
OS –  90L
Total World wide : 8.51CR (14.10Cr~ Gross)

సినిమాను టోటల్ గా 23.9 కోట్లకు అమ్మగా సినిమా 24.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 15.99 కోట్ల షేర్ ని ఇంకా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక మూడో రోజు ఆదివారం కాబట్టి సినిమా రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here