నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు అంచనాలు అన్నీ కూడా మించి పోయే రేంజ్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసింది. చాలా రేర్ గా జరిగే మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లు సొంతం అవ్వడం ఈ సినిమా విషయంలో జరగడం విశేషం అని చెప్పాలి. సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.17 కోట్ల షేర్ ని…
సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా 3.6 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని మాగ్జిమం వసూల్ చేసే ఛాన్స్ ఉందని భావించగా సినిమా ఆ అంచనాలను కూడా మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు 4.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.21Cr
👉Ceeded: 65L
👉UA: 52L
👉East: 21L
👉West: 17L
👉Guntur: 27L
👉Krishna: 20L
👉Nellore: 15L
AP-TG Total:- 4.38CR(7.12CR~ Gross)
ఇదీ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ రాంపేజ్.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.33Cr(inc GST)
👉Ceeded: 1.27Cr
👉UA: 1.03Cr
👉East: 41L
👉West: 33L
👉Guntur: 53L
👉Krishna: 38L
👉Nellore: 27L
AP-TG Total:- 8.56CR(14.02CR~ Gross)
Ka+ROI: 1.95Cr
OS – 2.30Cr
Total WW: 12.81CR(22.50CR~ Gross)
ఇదీ సినిమా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.
ఓవరాల్ గా రెండో రోజు సినిమా అంచనాలను మించి వసూళ్ళని సాధించి దుమ్ము లేపగా టోటల్ బిజినెస్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 22.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇప్పుడు మరో 9.69 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మూడో రోజు సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.