కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోలలో సూర్య కూడా ఒకరైనా రీసెంట్ టైం లో మాత్రం ఒకటి తర్వాత ఒకటి వరుసగా నిరాశ పరిచే సినిమాలతో మార్కెట్ ని చాలా వరకు కోల్పోతూ వచ్చాడు సూర్య…. 2019 టైం లో బందోబస్త్ సినిమా 1.02 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని NGK సినిమా 1.29 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా….
తర్వాత వచ్చిన ఆకాశం నీ హద్దురా అలాగే జై భీమ్ లాంటి సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఈటీ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో భారీగా రిలీజ్ అవ్వగా సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాలలో….
80 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ తో అంచనాలను అందుకోలేక పోయింది… ఇక రెండో రోజు రాధే శ్యామ్ నుండి పోటి వలన సినిమా 50% వరకు డ్రాప్ అవ్వగా కొద్ది వరకు తేరుకున్న సినిమా రెండో రోజు 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2 రోజుల్లో మొత్తం మీద 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని….
2.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉండగా ఇంకా 2.75 కోట్లు అందుకోవాల్సి ఉంది. ఇక తొలిరోజు తమిళ్ లో డిసాస్టరస్ ఓపెనింగ్స్ ని అందుకుంది… 6.5 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని మాత్రమే అందుకుందని సమాచారం…
ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ గా 6-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం. స్టార్ హీరో అయిన సూర్య నటించిన ఈటీ ఇలాంటి వీకేస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడం చూసి టోటల్ ట్రేడ్ కూడా బిత్తెర పోయారు అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.