బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని ఆది పినిశెట్టి ల కాంబినేషన్ లో లింగుస్వామి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ది వారియర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజు మాత్రం మౌత్ టాక్ ఇంపాక్ట్ గట్టిగానే కనిపించింది, దాంతో రెండో రోజు డ్రాప్స్ అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగానే…
సొంతం చేసుకుంది సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా 2.5 కోట్ల నుండి 2.7 కోట్ల దాకా కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని అంచనా వేసినా కానీ సినిమా ఓవరాల్ గా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో…
డ్రాప్ అయ్యి 2.30 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. టికెట్ రేట్స్ ని తగ్గించి ఉంటె ఆఫ్ లైన్ బుకింగ్స్ మరింత జోరుగా సాగి ఉండేవి కానీ అలా జరగలేదు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 2వ రోజున సినిమా 2.63 కోట్ల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.85Cr
👉Ceeded: 1.46Cr
👉UA: 1.34Cr
👉East: 72L
👉West: 76L
👉Guntur: 1.38Cr
👉Krishna: 45L
👉Nellore: 36L
AP-TG Total:- 9.32CR(13.90Cr~ Gross)
👉KA+ ROI: 50L
👉OS: 39L
👉Tamil – 44L~ est
Total World Wide: 10.65CR(16.55CR~ Gross)
ఇవీ మొత్తం మీద 2 రోజులకు గాను సినిమా ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 28.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.