బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా వీర విహారం చేసిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ కలెక్షన్స్ ని మొదటి వీకెండ్ లో సొంతం చేసుకోగా, ఓవర్సీస్ లో మాత్రం రెట్టించిన జోరు చూపెట్టిన ఈ సినిమా అక్కడ మూడు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ ని…
అందుకుని సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా లో ఫస్ట్ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది, ఇక ఈ క్రమంలో సినిమా అక్కడ ఈ ఇయర్ లో అక్కడ రిలీజ్ అయిన తెలుగు సినిమాల హైయెస్ట్ కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…
అక్కడ ఈ ఇయర్ మొదట్లో వచ్చిన జాతిరత్నాలు ఊహకందని ట్రెండ్ చూపెట్టి… 1.05 మిలియన్ డాలర్స్ ని వసూల్ చేసింది, తర్వాత సమ్మర్ లో వకీల్ సాబ్ 750K డాలర్స్ ని కలెక్ట్ చేశాయి. ఈ రెండింటికీ కూడా అక్కడ 30-40% ఆక్యుపెన్సీతోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేష మని చెప్పొచ్చు.
ఇక ఇప్పుడు కేసులు అక్కడ ఎక్కువగా ఉన్నా ఆక్యుపెన్సీ ఫుల్ ఉండటం తో లవ్ స్టొరీ సినిమా రెండు రోజులు పూర్తీ అయ్యే టైం కి వకీల్ సాబ్ లాంటి బిగ్ మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది, ఇక వీకెండ్ పూర్తీ అయ్యే టైం కే జాతిరత్నాలు ఔట్ అనుకున్నారు కానీ కొంచం వెనక్కి తగ్గిన లవ్ స్టొరీ సినిమా మరో 2 రోజులు టైం తీసుకుని…
మొత్తం మీద 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి 1.06 మిలియన్ మార్క్ ని అందుకుని తెలుగు సినిమాల పరంగా ఇప్పుడు టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది, ఓవర్సీస్ మార్కెట్ సెట్ అవ్వాలని కోరుకునే అందరి ఆశలను ఇప్పుడు నిజం చేస్తూ దూసుకు పోతున్న లవ్ స్టొరీ లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.