కోలివుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్ గా పేరున్న విజయ్ సేతుపతి వరుస పెట్టి సినిమాలను చేస్తూ ఉండగా వచ్చిన ఆఫర్ వచ్చినట్లు ఒప్పుకుంటున్నట్లు ఉన్నాడు అనిపించేలా రీసెంట్ టైం లో ఒకటి తర్వాత ఒకటి సినిమాలు వస్తూనే ఉన్నాయి… కథలను పట్టించుకోకుండా ఆఫర్స్ కి ఓకే చేస్తున్నాడేమో అనిపించేలా కొన్ని సినిమాలు ఏమాత్రం ఇంప్రెస్ చేయకుండా నిరాశ పరుస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకే వచ్చే సినిమానే లేటెస్ట్ గా వచ్చిన లాభం సినిమా…
విజయ్ సేతుపతి శృతి హాసన్ ల కాంబినేషన్ లో జగపతిబాబు విలన్ గా నటించిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా టాక్ కంప్లీట్ నెగటివ్ గా వచ్చింది… ఊరికి రిటర్న్ అయిన హీరో తన కొత్త టెక్నిక్స్ తో వ్యవసాయాన్ని చేస్తూ అందరి మన్నలను పొందుతూ…
విలేజ్ ప్రెసిడెంట్ అవుతాడు, మరి తర్వాత హీరో విలన్ ల పోటిలో ఎవరు గెలిచారు అన్నది కథ… రొటీన్ రొట్ట అనిపించేలా ఉన్న సినిమా ఏ దశలో కూడా ఇంప్రెస్ చేయలేక పోయింది అని చెప్పాలి. కోలివుడ్ లో కూడా సినిమా కి కంప్లీట్ నెగటివ్ రివ్యూలు రావడం తో సినిమా ఫేట్ డిసైడ్ అయినట్లే…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాడు లో మొదటి రోజు 1 కోటి గ్రాస్ ను రెండో రోజు 1.2 కోట్ల గ్రాస్ ని మొత్తంమీద 2 రోజుల్లో 2.2 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం కంప్లీట్ వైట్ వాష్ అయిపొయింది అని చెప్పాలి. సినిమా ఆల్ మోస్ట్ 240 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా తొలిరోజు మొత్తం మీద పట్టుమని 10 లక్షల…
గ్రాస్ ను కూడా అందుకోలేక పోయింది… ఇక డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ రావడం తో అవి తీసేస్తే ఫస్ట్ డే షేర్ 3 లక్షల రేంజ్ లో ఉంటుంది… ఓవరాల్ గా 2 రోజుల్లో 15 లక్షల రేంజ్ లో గ్రాస్ ని 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుందని అంచనా… సినిమాను తెలుగు లో 80 లక్షలకి అమ్మారు, 1 కోటి టార్గెట్ అందుకోవాలి అంటే అద్బుతాలు జరగాల్సి ఉంటుంది.