యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తర్వాత లాస్ట్ ఇయర్ భీష్మ సినిమా తో సూపర్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా తర్వాత మాత్రం బాక్ టు బాక్ 2 సినిమాలతో నిరాశ పరిచాడు. ఒకటి ప్రయోగం అవ్వడం తో రిజల్ట్ తేడా కొట్టినా మరోటి మంచి టాక్ నే సొంతం చేసుకున్నా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం విషయం లో మాత్రం దెబ్బ తిన్నది.
రెండు సినిమా బాక్ టు బాక్ ఈ ఇయరే నెల గ్యాప్ లో రిలీజ్ అవ్వగా చెక్ భారీ నష్టాలను సొంతం చేసుకుంటే రంగ్ దే సినిమా కూడా నష్టాలూ గట్టిగానే వచ్చాయి, కానీ ఈ ఫ్లాఫ్ ఎఫెక్ట్ ఏమాత్రం కూడా నితిన్ అప్ కమింగ్ మూవీ పై కనిపించక పోవడం…
ఇప్పుడు విశేషం అని చెప్పాలి. నితిన్ ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేస్ట్రో… హిందీ లో సూపర్ హిట్ అయిన అంధ ధూన్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా లో నభ నటేష్ మరియు తమన్నాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా రిలీజ్ ను ముందు జూన్ 11 న అనుకున్నారు కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఇక మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కి కూడా ఇప్పుడు OTT లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం సాలిడ్ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. లీడింగ్ OTT జైంట్స్ ఈ సినిమా కోసం ఏకంగా ఇప్పుడు…
30 కోట్ల రేంజ్ కి తగ్గని రేటు ని కోట్ చేస్తున్నారని టాలీవుడ్ ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది, రెండు బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత కూడా మరో ఎక్స్ పెరిమెంటల్ మూవీ కి ఇలాంటి రేటు దక్కడం అంటే అద్బుతం అనే చెప్పాలి. ఇక మేకర్స్ సినిమా పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.