Home గాసిప్స్ 2 ఇండస్ట్రీ హిట్స్…17 ఏళ్ల గ్యాప్…సెన్సేషనల్ కాంబో రిపీట్!

2 ఇండస్ట్రీ హిట్స్…17 ఏళ్ల గ్యాప్…సెన్సేషనల్ కాంబో రిపీట్!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ ని రీసెంట్ టైం లో బెటర్ గా చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. బోయపాటి కన్నా ముందు బాలయ్య ని ఇంకా పవర్ ఫుల్ గా చూపెట్టి బ్లాక్ బస్టర్స్ తో పాటు ఏకంగా ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన డైరెక్టర్ బి గోపాల్ అని చెప్పాలి. బాలయ్య తో బి గోపాల్ పలు సినిమాలు చేయగా అందులో…

ఎక్కువ శాతం సూపర్ సక్సెస్ అవ్వగా రెండు సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీశాయి. సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు సినిమాలు టాలీవుడ్ హిస్టరీ లో ఫాక్షన్ మూవీస్ లో సరికొత్త రికార్డులు నమోదు చేసి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి.

ఈ రెండు సినిమాల ఇండస్ట్రీ హిట్స్ తో వీళ్ళ కాంబినేషన్ పై క్రేజ్ పీక్స్ కి వెళ్ళగా వీళ్ళ కాంబో లో మళ్ళీ పలనాటి బ్రహ్మనాయుడు సినిమా వచ్చినా అది అంచనాలను అందుకోవడం లో పూర్తిగా విఫలం అవ్వగా బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా చేరి షాక్ ఇచ్చింది.

తర్వాత బాలుయ్య బి గోపాల్ కాంబినేషన్ మళ్ళీ సెట్ కాలేదు. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలు అయ్యే అవకాశం పుష్పలంగా ఉందని ఇండస్ట్రీ లో టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మోనార్క్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా అంటున్నారు కానీ కన్ఫాం అవ్వలేదు, అందుకే బ్యాకప్ గా బి గోపాల్ చెప్పిన లైన్ నచ్చిన బాలయ్య వీలు కుదిరిన వెంటనే ఆ ప్రాజెక్ట్ చేయాలని రెడీగా ఉన్నారని తెలుస్తుంది. దాంతో ఆల్ మోస్ట్ 17 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here