Home Uncategorized 2 సినిమాలు 100 కోట్ల లాస్…లబో దిబో అంటున్న నిర్మాత!

2 సినిమాలు 100 కోట్ల లాస్…లబో దిబో అంటున్న నిర్మాత!

1380
0

ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు చేసి తీసే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయితే నిర్మాతల భాద ఊహాతీతంగా ఉంటుంది. ఇప్పుడు అదే భాద ని అనుభవిస్తున్నాడు బాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్. రీసెంట్ గా ఆయన నిర్మాణం లో వచ్చిన సినిమాల్లో 3 సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ అయ్యాయి. కేసరి, కలంక్ మరియు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలు. ఇందులో కేసరి ఎలాగోలా బ్రేక్ ఈవెన్ అయ్యింది.

ఇక కలంక్ ని ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో తీయగా కేవలం 30 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి డిసాస్టర్ అయ్యింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాను కూడా అదే రేంజ్ లో 80 కోట్ల బడ్జెట్ తో తీశాడట. సినిమా ఇప్పటి వరకు టోటల్ గా 25 కోట్ల వరకు..

షేర్ ని రాబట్టింది. దాంతో లాంగ్ రన్ లో మరో 5 కోట్లు వస్తే రావచ్చు అంటున్నారు. ఓవరాల్ గా ఈ రెండు సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నా కానీ రెండు కలిపి ఏకంగా 100 కోట్ల నష్టాన్ని మిగిలించాయట. దాంతో ఇక మీదట తీసే సినిమాల విషయం లో మరింత శ్రద్ధ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట కరణ్ జోహార్.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!