Home న్యూస్ 2.0 డే 3 కలెక్షన్స్…బ్యాటింగ్ స్టార్ట్!

2.0 డే 3 కలెక్షన్స్…బ్యాటింగ్ స్టార్ట్!

249
0

  సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో టోటల్ గా 165 కోట్ల గ్రాస్ ని 83 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా మూడో రోజు సినిమా అసలు సిసలు బ్యాటింగ్ ని మొదలు పెట్టింది. సినిమా టార్గెట్ భారీ గా ఉండటం తో మూడో రోజు మరియు నాలుగో రోజు కీలకం అని చెప్పాలి.

కాగా తెలుగు వర్షన్ మొదటి రెండు రోజులు లాగే దుమ్ము లేపుతుండగా సినిమా మూడో రోజు రెండు రాష్ట్రాలలో మరో సారి 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఇక హిందీ వర్షన్ గ్రోత్ ని సాధించి ఈ రోజు 24 కోట్ల రేంజ్ నెట్ వసూళ్లు అందుకోవచ్చు.

ఇక తమిళ్ వర్షన్ అండర్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుండగా ఈ రోజు కూడా 10 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోబోతుంది. దాంతో ఓవరాల్ గా సినిమా మూడో రోజు 60 కోట్లకు పైగా గ్రాస్ కన్ఫాం అవ్వగా ట్రేడ్ పండితులు ఈ లెక్క 70 దాటాలని ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here