ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టొరీ లైన్ టోటల్ గా రివీల్ చేయకున్నా రేడియేషన్ వలన చనిపోయిన విలన్ అసలు సెల్ ఫోన్స్ లేకుండా చేయాలి అని ఫిక్స్ అవుతాడు.
అదే పని లో ఉండగా డాక్టర్ వశీకర్ చిట్టి, రోబో 2.0 ల సహాయం తో ఎలా ఆ విలన్ ని అడ్డుకున్నాడు అన్నది స్టొరీ అని అంటున్నారు. స్టొరీ ఈ సినిమా లో అసలు ఇంపార్టెంట్ ఏ కాదని విజువల్స్ తో శంకర్ సినిమా లెవల్ లో టోటల్ గా మర్చేశాడని అంటున్నారు.
రజినీకాంత్ మూడు డిఫెరెంట్ పాత్రల్లో కుమ్మేశాడని 2.0 పాత్రలో కామెడీ కూడా అదిరిపోయిందని అంటున్నారు, అమీ జాక్సన్ నటన ఓకే అనిపిస్తుందని, విలన్ గా అక్షయ్ కుమార్ సినిమా కి పెద్ద అసెట్ గా మారాడని తన మార్క్ కనిపించే సీన్స్ చాల ఉన్నాయని అంటున్నారు.
ఇక రెహమాన్ అందించిన సంగీతం ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ అంతకి మించి ఊపు నిచ్చిందని అంటున్నారు. సెకెండ్ ఆఫ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అయ్యే సీన్స్ కి బాగా హెల్ప్ అయిందని అంటున్నారు. ఇక విజువల్స్ అండ్ గ్రాండియర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.
సినిమా ను బెస్ట్ ఎక్స్ పీరియన్స్ చేయాలి అంటే కచ్చితంగా 3 D లోనే చూడాలి అని చెబుతున్నారు. అప్పుడే విజువల్స్ మాయా జాలం గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది అంటున్నారు. ఇక శంకర్ గురించి చెప్పాలి అంటే సింపుల్ గా…
శంకర్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. రోబో తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న శంకర్ ఈ సినిమా ను ఎంత కసి తో తీశాడో అర్ధం అవుతుంది అంటున్నారు. ప్రతీ సీన్ హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా తీసి మెప్పించాడని అంటున్నారు.
ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మరో లెవల్ లో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. టోటల్ గా సినిమా ఓ విజువల్ వండర్ లా అనిపించింది అని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతుండటం సినిమా కి మరింత ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
టోటల్ గా రోబో 2.0 సినిమా కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ టాక్ లభించింది అని చెప్పొచ్చు. ఇదే టాక్ ని ఇక్కడ రెగ్యులర్ షోల కి కూడా సొంతం చేసుకుంటే చరిత్రకేక్కే అల్టిమేట్ రికార్డులు రోబో 2.0 సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.