నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 14 వ రోజు మరో వర్కింగ్ డే ను ఫేస్ చేయగా మొత్తం మీద 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని డీసెంట్ హోల్డ్ తో కుమ్మేసింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
మొదటి వారం మొత్తం మీద 53.49 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. అందులో తెలుగు రాష్ట్రాలలో 45.11 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇక రెండో వారానికి వచ్చే సరికి 9.82 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది అని చెప్పాలి.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో 53.49 కోట్ల షేర్ ని అందుకుంటే రెండో వారానికి వచ్చే సరికి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 11.24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది. ఒక సారి ఏరియాల వారిగా సినిమా సాధించిన షేర్స్ ని గమనిస్తే….
👉Nizam: 18.25Cr
👉Ceeded: 13.97Cr
👉UA: 5.66Cr
👉East: 3.80Cr
👉West: 3.13Cr
👉Guntur: 4.40Cr
👉Krishna: 3.32Cr
👉Nellore: 2.40Cr
AP-TG Total:- 54.93CR(90CR~ Gross)
Ka+ROI: 4.60Cr(updated)
OS – 5.20Cr
Total WW: 64.73CR(112CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలలో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క.
సినిమాను మొత్తం మీద 53 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 2 వారాల తర్వాత సాధించిన కలెక్షన్స్ తో సినిమా 10.73 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… ఇక సినిమా మూడో వారం లో ఎలాంటి థియేటర్స్ ని హోల్డ్ చేస్తుంది, కొత్త సినిమాల పోటి ని ఎలా తట్టుకుంటుందోచూడాలి.