పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఆంధ్ర లో టికెట్ రేట్స్ ఇష్యూ వలన ఇబ్బందులను ఫేస్ చేసిన సినిమా ఎలాగోలా మొదటి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించినా కానీ రెండో వారంలో మాత్రం భారీ ఎదురు దెబ్బ తగిలింది సినిమా కి… కలెక్షన్స్ పరంగా సినిమా…
రెండో వారం డ్రాస్టిక్ గా ఫాల్ అయ్యి నిరాశ పరిచి సూపర్ టాక్ ని కూడా వేస్ట్ చేసుకుని ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశమే కనిపించడం లేదు అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలలో 70.40 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…
రెండో వారంలో భారీగా డ్రాప్ అయ్యి కేవలం 4.62 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది…. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 వ రోజు 10 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. దాంతో సినిమా టోటల్ గా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 34.62Cr(Without GST- 31.54Cr)
👉Ceeded: 11.00Cr
👉UA: 7.53Cr
👉East: 5.44Cr
👉West: 4.95Cr
👉Guntur: 5.19Cr
👉Krishna: 3.76Cr
👉Nellore: 2.53Cr
AP-TG Total:- 75.02CR(114.60Cr~ Gross)
👉KA+ROI: 8.21Cr
👉OS: 12.47Cr
Total World Wide: 95.70CR(155.75CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.
అంత మంచి పాజిటివ్ టాక్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం భారీగా డ్రాప్ అయిన సినిమా ఇప్పుడు మొత్తం మీద 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 12.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక మూడో వీకెండ్ లో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇది కష్టమే అని చెప్పాలి.