Home న్యూస్ 16 నిమిషాల సినిమా….2 వీక్స్ ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత!

16 నిమిషాల సినిమా….2 వీక్స్ ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత!

1475
0

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నర్తనశాల, ఆల్ మోస్ట్ 16 నిమిషాల ఫూటేజ్ షూటింగ్ చేసిన తర్వాత ద్రౌపతి పాత్ర పోషించిన సౌందర్య గారి మరణం వలన సినిమా షూటింగ్ ఆగిపోగా ఆ ఫూటేజ్ ను తర్వాత అలానే ఉంచగా ఆల్ మోస్ట్ 16 ఏళ్ల తర్వాత ఈ ఫూటేజ్ ను మినీ మూవీ గా మార్చి దసరా కానుక గా డిజిటల్ రిలీజ్ గా రిలీజ్ చేశారు.

కాగా సినిమా కి ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ రాగా ఈ మినీ మూవీ కి రికార్డ్ లెవల్ లో వ్యూస్ దక్కడం విశేషం అని చెప్పొచ్చు. కాగా 50 టికెట్ రేటు తో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు 1 లక్షా 95 వేల వ్యూస్ ని,

వీకెండ్ లో 2 లక్షల 85 వేల వ్యూస్ ని, 5 రోజుల్లో 4 లక్షల 15 వేల వ్యూస్ ని సొంతం చేసుకోగా మొదటి వారం లో 5 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది, మొదటి 10 రోజులు పూర్తీ అయ్యే సరికి 5 లక్షల 46 వేల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు…

రెండు వారాలను సాధించిన వ్యూస్ లెక్కలు ట్రేడ్ లో రిలీజ్ అయ్యాయి, ఆ లెక్కల ప్రకారం మిగిలిన 4 రోజుల వర్కింగ్ డేస్ లో సినిమా కి 34 వేల దాకా వ్యూస్ దక్కగా టోటల్ గా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి ఈ మినీ మూవీ టోటల్ గా 5 లక్షల 80 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ మినీ మూవీ కలెక్షన్స్ ఎంతవరకు వచ్చి ఉంటాయి అంటే 50 టికెట్ రేటు తో 5 లక్షల 80 వేల యూనిక్ వ్యూస్ కి సినిమా టోటల్ గా 2.9 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉంటుందని అంటున్నారు. ఇది నిజంగానే మాస్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. లాంగ్ రన్ లో 3 కోట్ల మార్క్ ని అందుకుని పరుగును ముగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here