Home న్యూస్ 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్న ఎపిక్ నువ్వు నాకు నచ్చావ్…ఆ టైం లో ఈ సినిమా...

20 ఏళ్ళు పూర్తీ చేసుకున్న ఎపిక్ నువ్వు నాకు నచ్చావ్…ఆ టైం లో ఈ సినిమా ప్రాఫిట్స్ తెలిస్తే షాకే!!

2835
0

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఆడియన్స్ కి వెంకీ మూవీస్ చెప్పాలి అంటే ఎప్పుడూ ముందు నిలిచే సినిమా నువ్వు నాకు నచ్చావ్, చాలా సాదాసీదా సినిమా గా రూపొండినా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కనక వర్షం కురిపించిన ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో వేసిన ప్రతీ సారి అప్పుడే ఫస్ట్ టైం చూసినట్లు…

జనాలు అలా టీవీ లకు అతుక్కుపోయేలా ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది.. ఇలా ఏళ్ళు గడుస్తున్నా కానీ సినిమా ఎప్పుడూ కూడా సోషల్ మీడియా లో మీమ్స్ రూపంలో గుర్తుకు వస్తూనే ఉంటుంది. అలాంటి ఈ ఎపిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ముందుకు వచ్చి….

రీసెంట్ గా 20 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. వెంకటేష్ రోల్ ఎంత సింపుల్ గా ఉంటుందో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అంత ఇంపాక్ట్ ని కామెడీ ని క్రియేట్ చేశాయి, సాంగ్స్ ఇప్పటికీ ఫ్రెష్ గా ఎదో తెలియని ట్రాన్స్ కి తీసుకువెళ్ళేలా ఉంటాయి ఈ సినిమాలో. ఇక సెంటి మెంట్ సీన్స్ కూడా మెప్పిస్తాయి.

ఇక కామెడీ గురించి చెప్పేది ఏముంది, మొదటి సీన్ నుండి ఎండ్ వరకు అద్బుతమైన కామెడీ సీన్స్ తో మెప్పించే నువ్వు నాకు నచ్చావ్ ఇప్పటికీ మీమ్స్ లో జనాలకు గుర్తుకు వస్తూనే ఉంటుంది. బ్రహ్మానందం కామెడీ మరో హైలెట్ గా నిలిచే ఈ సినిమాలో సెకెండ్ ఆఫ్ లో ఎగ్జిబిషన్ కామెడీ ఓ రేంజ్ లో హిలేరియస్ గా వర్కౌట్ అయ్యింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైం లో 7.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ ఏకంగా 18.2 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బిజినెస్ మీద ఏకంగా 11 కోట్ల ప్రాఫిట్ ను ఆ టైం లో సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది… ఎప్పటికీ ఎపిక్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here