Home న్యూస్ ఇదేం క్రేజ్ రా బాబు….200+ అటు…..40+ ఇటు…రికార్డుల రాంపేజ్!

ఇదేం క్రేజ్ రా బాబు….200+ అటు…..40+ ఇటు…రికార్డుల రాంపేజ్!

1128
0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ పాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప, రెండు పార్టులుగా ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడో అనౌన్స్ చేయగా షూటింగ్ ఇప్పటికీ జరుగుతున్న ఈ సినిమా ఎట్టి పరిస్థితులలో కూడా ఆన్ టైం కి బరిలో దిగాలి అని రాత్రి పగలు కష్టపడుతున్నారు.

మరో పక్క సినిమా సాంగ్స్ కి అల్టిమేట్ రీచ్ దక్కుతూ ఉండగా రిలీజ్ కి ఇంకా టైం దగ్గర పడుతూ ఉండగా సినిమా బిజినెస్ అండ్ థియేటర్స్ అగ్రిమెంట్స్ జోరు అందుకున్నాయి. తమిళ్ లో ఆల్ రెడీ లైకా వాళ్ళు చాలా గట్టిగానే ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండగా…

కేరళలో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు, అల్లు అర్జున్ కి కేరళ కంచుకోట లాంటిది, అక్కడ ఇతర స్టార్స్ కన్నా కూడా అల్లు అర్జున్ మూవీస్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది… ఆ క్రేజ్ ఇప్పుడు పుష్ప తో మరింత పెరిగే అవకాశం ఉండగా ఈ సినిమాను అక్కడ…

200 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని కూడా చెబుతూ ఉండగా ఇక స్పెషల్ షోలు ఆల్ టైం రికార్డ్ అనేలా ప్లాన్ చేస్తున్నారు అక్కడ ఫ్యాన్స్… ఆల్ మోస్ట్ 40 కి పైగా స్పెషల్ ఫ్యాన్ షోలు ఆల్ రెడీ ప్లాన్ చేయగా ఇది అక్కడ ఇతర ఇండస్ట్రీ హీరోల పరంగా వన్ ఆఫ్ ది…

బిగ్గెస్ట్ ఫ్యాన్స్ షోల రికార్డ్ అని అంటున్నారు. ఇంకా ఫైనల్ లెక్క 50-60 కి చేరుకునే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉండగా కచ్చితంగా అక్కడ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ట్రైలర్ కనుక అంచనాలను మించి ఉంటే ఈ రచ్చ డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here