బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన బిగ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(Game Changer) మొదటి ఆటకే ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది…టోటల్ రన్ లో అతి కష్టం మీద 200 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 223 కోట్ల టార్గెట్ లో 49% రేంజ్ లో రికవరీని అందుకున్న సినిమా 114 కోట్ల రేంజ్ లో లాస్ ను అందుకుని డబుల్ డిసాస్టర్ గా రన్ ను కంప్లీట్ చేసుకున్న సినిమా తర్వాత డిజిటల్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో….
వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాను తర్వాత జీ నెట్ వర్క్ వాళ్ళు భారీ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగూ నిరాశ పరిచినా టెలివిజన్ లో అయినా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది ఏమో అని అనుకున్నా…
టెలివిజన్ లో మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 5.02 రేంజ్ లోనే టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ను టెలివిజన్ లో కూడా సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా మరోసారి టెలికాస్ట్ అయిన సినిమా ఈ సారి అయినా అక్కడ…
హోల్డ్ చేస్తుంది అనుకోగా ఓవరాల్ గా రెండో సారి టెలికాస్ట్ లో సినిమా 3.41 రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని ఓకే అనిపించుకునే రేంజ్ లో హోల్డ్ చేసింది కానీ ఓవరాల్ గా ఛానెల్ సినిమాను పెట్టి కొన్న రేటు దృశ్యా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ని టెలివిజన్ లో లాంగ్ రన్ లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.