బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్ ల క్రేజీ కాంబోలో భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్ తో రూపొందిన పాన్ ఇండియా మూవీ అయిన గేమ్ చేంజర్(Game Changer Movie) ఈ సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా, అడ్వాన్స్ బుకింగ్స్ నుండే సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా…
రిలీజ్ అయిన తర్వాత టాక్ అయినా పాజిటివ్ గా వచ్చి ఉంటే కుమ్ముతుంది అనుకున్నా కూడా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా, సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో నెగటివ్ ట్రోల్స్ ని ఫేస్ చేసింది, ఆఫ్ లైన్ లో కూడా డిసాస్టర్ టాక్ అంటూ…
సినిమా టాక్ స్ప్రెడ్ అయిపొయింది….ఇక దానికి తోడూ ఇతర సంక్రాంతికి సినిమాలకు మంచి టాక్ రావడంతో గేమ్ చేంజర్ తేరుకోలేక పోయింది. అన్నింటికీ మించి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ మీద డబుల్ గ్రాస్ పోస్టర్ ను వదలడం రీసెంట్ టైంలో…
ఏ సినిమా కి పడనన్ని ట్రోల్స్ ని ఫేస్ చేసింది. అదే సినిమాకి భారీ లెవల్ లో ఎదురుదెబ్బ కొట్టింది. ఇలాంటివి అన్నీ ఫేస్ చేసినా కూడా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అయితే అందుకుంది…సినిమా మీద ఉన్న హైప్ కి…
టాక్ పాజిటివ్ గా వచ్చి ఉంటే సినిమా మాస్ రచ్చ చేసే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా సినిమా కంప్లీట్ గా నెగటివ్ టాక్ ను అందుకోవడం ఎదురుదెబ్బ తీసినా కూడా ఓవరాల్ గా సినిమా ఫైనల్ రన్ లో 200 కోట్ల మైలురాయి ని అయితే దాటింది కానీ..
సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం టాలీవుడ్ చరిత్ర లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ లాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది అని చెప్పాలి. ఓవరాల్ గా ఎపిక్ డిసాస్టర్ టాక్ అండ్ ట్రోల్స్ తో కూడా 200 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం అయినా లాస్ పరంగా కూడా భారీ నష్టాలతో మైండ్ బ్లాంక్ చేసింది అని చెప్పాలి.