Home న్యూస్ ఇది మాస్ రాంపేజ్…..200 కోట్లు ఔట్….న్యూ ఇండియన్ రికార్డ్!

ఇది మాస్ రాంపేజ్…..200 కోట్లు ఔట్….న్యూ ఇండియన్ రికార్డ్!

2068
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడెప్పుడు కంబ్యాక్ చేస్తామా, వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ ను ఏలుదామా అని ఎదురు చూస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఎట్టకేలకు ఇప్పుడు సూర్యవంశీ సినిమా తో ఊపిరి పీల్చుకుంది. సినిమా బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోయడమే కాదు ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ అన్నింటికి కూడా భారీ ధైర్యాన్ని కలిగేలా చేస్తూ దూసుకు పోతుంది, సినిమా కి మరీ అద్బుతం అనిపించే…

టాక్ ఏమి ఆడియన్స్ నుండి రాకున్నా కానీ సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి సినిమా ఇండియాలో 120 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని, వరల్డ్ వైడ్ గా 180 కోట్ల కి పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని…

దుమ్ము లేపగా ఇప్పుడు రెండో వారంలో కూడా ఎలాంటి పోటి లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఒక్క సినిమానే ఆప్షన్ గా నిలవడంతో రెట్టించిన జోరు చూపెట్టి దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు 9 రోజులు పూర్తీ అయ్యే సరికి ఇండియాలో 137 కోట్ల నెట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా 203 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఏడాదిన్నరగా బాలీవుడ్ తరుపున 200 కోట్ల మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు. ఇక ఈ ఇయర్ లో ఫాస్టెస్ట్ 200 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాగా కూడా నిలిచిన ఈ సినిమా…

సెకెండ్ వేవ్ తర్వాత ఫస్ట్ 200 కోట్ల మార్క్ మూవీగా కూడా నిలిచి సంచలనం సృష్టించింది. లాంగ్ రన్ లో ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉన్న ఈ సినిమా ఇండియా లో నెట్ కలెక్షన్స్ పరంగా 180 కోట్లకు రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉన్న సినిమా గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా పడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here