బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) నాలుగు వారాలను కంప్లీట్ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టగా న్యూ ఇయర్ వీకెండ్ లో మరోసారి అన్ని చోట్లా రచ్చ చేస్తూ….
సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా సినిమా ఇప్పుడు మరో మమ్మోత్ రికార్డ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ తో ఆల్ రెడీ రికార్డులను అందుకున్న పుష్ప2 మూవీ..
లాంగ్ రన్ లో ఈ రికార్డ్ బిజినెస్ ను అందుకోవడం అన్నది బిగ్గెస్ట్ టాస్క్ అయితే ఆ టాస్క్ ని అవలీలగా కంప్లీట్ చేసి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను అందుకున్న సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో మరింతగా రెచ్చిపోతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లాభాలతో…
టాలీవుడ్ తరుపున ఆల్ రెడీ ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న మూవీగా సంచలనం సృష్టించింది…సినిమా ఇప్పుడు 30 రోజులు పూర్తి అయ్యే టైంకి మరో బెంచ్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….617 కోట్ల బిజినెస్ మీద…
30 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 200 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని చరిత్రలో ఇంత బిజినెస్ మీద ఈ రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకున్న మూవీగా సంచలన రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది…ఈ రేంజ్ లో లాంగ్ రన్ లో ఊహకందని రాంపెజ్ ను చూపెడుతున్న సినిమా…
మేజర్ కలెక్షన్స్ హిందీ నుండే రాగా ఓవరాల్ గా అక్కడ నుండి కూడా ప్రాఫిట్ రేంజ్ మరో లెవల్ లో ఉండటం తో ఓవరాల్ గా లాభాల పరంగా సాలిడ్ రికార్డులు సృష్టించే క్రమంలో హెల్ప్ అయింది అని చెప్పాలి….ఇక ఫైనల్ రన్ లో సినిమా ఇంకా లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.