2021 లో అడుగు పెట్టి సగం ఇయర్ కూడా అయిపొయింది, లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది, ఇక ప్రతీ ఇయర్ ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ను సొంతం చేసుకుంటాయి కానీ అందులో కొన్ని మాత్రమె ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇండస్ట్రీ హిట్స్ అంటే పాత హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా కలెక్షన్స్ ని దాటి ఎక్కువ వసూల్ చేసిన కొత్త సినిమా ను ఇండస్ట్రీ హిట్ గా పరిగణ లోకి తీసుకుంటూ ఉంటారు.
కానీ ఇక్కడ ఒక మెలుకు కూడా ఉందని, అదే సమయంలో సినిమా బిజినెస్ ఎంత?, ఆ బిజినెస్ ని సినిమా దాటిందా లేదా అన్నది కూడా ముఖ్యమే… 2019 ఇయర్ లో 2 రెండు సినిమాల విషయం లో ఇలాంటిదే జరిగింది. బాహుబలి రాకతో టాలీవుడ్ లో లెక్కలు మారిపోయాయి.
నాన్ బాహుబలి లెక్కలు మొదలు అయ్యాయి… అలాంటి సమయంలో 2019 లో సాహో మరియు సైరాలు రెండూ భారీ వసూళ్ళని సాధించినా హిట్ కాలేదు. సాహో యావరేజ్ గా నిలిచిపోగా సైరా ఫ్లాఫ్ గా పరుగును పూర్తీ చేసుకుంది కానీ సాహో వరల్డ్ వైడ్ నాన్ బాహుబలి హైయెస్ట్ కలెక్షన్స్ అందుకోగా సైరా తెలుగు వర్షన్ వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించింది.
దాంతో ఈ 2 సినిమాలు కూడా ప్యూర్ ఇండస్ట్రీ హిట్స్ కాక పోయినా పాత రికార్డులను బ్రేక్ చేశాయి కాబట్టి ఈ లిస్టులో ఉంటాయి…ఒకసారి ఈ దశాబ్దంలో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే
#AttarintikiDaredi(2013)
#Baahubali 1(2015)
#Srimanthudu(2015)(Non BB Industry Hit)
#KhaidiNo150(2017)(Non BB)
#Baahubali2(2017)
#Rangasthalam(2018)(Non BB)
#Saaho(2019)(Non BB Highest WW Grosser)
#SyeRaa(2019)(Non BB Telugu Version Highest Grosser)
#AlaVaikunthaPurramuloo(2020) (Non BB Highest Share)
ఈ లిస్టులో ఒక్క హిట్స్ మూవీస్ విషయంలోనే ఇండస్ట్రీ హిట్స్ ని పరిగణ లోకి తీసుకుంటే అల వైకుంఠ పురంలో రంగస్థలం రికార్డ్ ను బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా మారింది అని చెప్పొచ్చు. అలా కాదు పాత కలెక్షన్స్ ని దాటితే సరిపోతుంది అనుకుంటే తెలుగు వర్షన్ వరకు సైరా… వరల్డ్ వైడ్ గా సాహో ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ ని సాధించాయని చెప్పొచ్చు. ఎవరు ఏది బెటర్ అనుకుంటే అది ఫాలో అవ్వొచ్చు..