Home గాసిప్స్ 2015 వచ్చిన సినిమా…ఇప్పటికీ రాలేదు…డిజిటల్ రిలీజ్ కి మంచి రేటు!

2015 వచ్చిన సినిమా…ఇప్పటికీ రాలేదు…డిజిటల్ రిలీజ్ కి మంచి రేటు!

3056
0

యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు కానీ ఒకప్పుడు మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే హిట్స్ ని సొంతం చేసుకున్నారు రాజశేఖర్, కానీ తర్వాత తర్వాత సరైన స్క్రిప్ట్ సెలెక్షన్ లేక పోవడం తో లాంగ్ రన్ లో ఎఫెక్ట్ అవ్వగా రాజశేఖర్ నుండి వచ్చిన లాస్ట్ క్లీన్ హిట్ మూవీ మాత్రం….

అప్పుడెప్పుడో 2008 లో వచ్చిన గోరింటాకు సినిమా అని చెప్పొచ్చు. తర్వాత 2017 టైం లో గరుడ వేగ సినిమా తో మెప్పించినా కానీ సినిమా బడ్జెట్ ఎక్కువ అవ్వడం తో కాస్ట్ ఫేల్యూర్ గా నిలిచింది ఆ సినిమా. అలాగే కల్కి కూడా మంచి పేరు సొంతం చేసుకున్న హిట్ అవ్వలేదు… వీటికన్నా ముందు హిట్ అయ్యే అవకాశం ఉండీ మిస్ చేసుకున్న సినిమాగా…

మరో సినిమా ను చెప్పుకోవాలి, ఆ సినిమానే తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సూదుకవ్వం తెలుగు రీమేక్ గడ్డం గ్యాంగ్, మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు లో రీమేక్ చేయగా సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఆడియన్స్ ను మెప్పించలేక పోయిన ఈ సినిమా వచ్చి….

6 ఏళ్ళు అవుతుంది కానీ సినిమా రిలీజ్ అయినట్లు కొద్ది మందికే తెలుసు, ఇక టెలివిజన్ లో ఇప్పటి వరకు టెలికాస్ట్ కూడా అవ్వని ఈ సినిమా ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది అని టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, 6 ఏళ్ల నుండి శాటిలైట్ రైట్స్ అమ్మకం జరగని ఈ సినిమా కోసం…..

కొన్ని OTT యాప్స్ 2 కోట్ల దాకా రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం, కానీ కొన్ని కారణాల వలన సినిమా డీల్ కుదరడం లేదని, కుదిరిన వెంటనే డైరెక్ట్ రిలీజ్ కి ఈ సినిమా సిద్ధం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, 6 ఏళ్ల క్రితం మూవీ కి ఇప్పుడు ఈ రేటు డిజిటల్ రిలీజ్ కి దక్కితే అద్బుతమైన రేటు అనే చెప్పాలి. మరి సినిమా ఇప్పుడన్నా వస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here