ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలో ఆ రేంజ్ లో కుమ్మేసిన సినిమా ఒక్కటీ లేదు. భారీ ఆశలు పెట్టుకున్న సల్మాన్ ఖాన్ రేస్ 3 భారీ షాక్ ఇచ్చింది. తర్వాత పండగలు లేకుండా వర్కింగ్ వీకెండ్ లో రిలీజ్ అయిన సంజు బరిలోకి దిగింది.
సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి అల్టిమేట్ రికార్డులను నెలకొల్పుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 346 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి ప్రస్తుతానికి ఇండియా లో 2018 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇయర్ చివర్లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్, డ్రాఫ్, సింబా లాంటి సినిమాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా మార్పులు ఉంటాయో లేదో చూడాలి.