అలా బిగ్గెస్ట్ మాస్ హిట్స్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే…
ముందుగా ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన రంగస్థలం సినిమా క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా రిలీజ్ అయిన 100 రోజుల తర్వాత కూడా కొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళ లాడి ఈ ఇయర్ లోనే కాదు రీసెంట్ ఇయర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
ఇక తర్వాత వచ్చిన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ఫ్యాన్స్ తో పాటు అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మాస్ కంటెంట్ మరీ ఎక్కువగా లేకున్నా కానీ ఉన్నంతలో ఈ సినిమా కూడా బెస్ట్ మాస్ హిట్ గా నిలిచింది.
ఇక గీత గోవిందం సినిమా కూడా ఈ ఇయర్ అల్టిమేట్ విజయాన్ని అందుకుని బిగ్ మాస్ హిట్స్ లో చోటు దక్కించుకున్న క్లాస్ మూవీ గా నిలిచింది. ఫైట్ సీన్స్ వగైరా పెద్దగా లేకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజుల పాటు అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ హిట్ గా నిలిచింది.
ఇక ఇయర్ చివర్లో వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఫ్యాన్స్ తో పాటు మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుని పండగ సమయం లో భీభత్సమైన కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది. దాంతో ఈ ఇయర్ బెస్ట్ మాస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా.
ఇవీ మొత్తం మీద ఈ ఇయర్ కి గాను బెస్ట్ మాస్ హిట్స్ గా నిలిచిన సినిమాలు, మిగిలిన సినిమాల్లో మరేవీ కూడా పెద్దగా అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకుని ఈ రేంజ్ విజయాన్ని అందుకోలేదు..ఉన్నంతలో మహానటి మల్టి ప్లేక్స్ అండ్ కొన్ని బి సి సెంటర్స్ లో ఆకట్టుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక 2019 లో కొన్ని క్రేజీ బిగ్ మూవీస్ వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు అన్ని అంచనాలను అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురవడం ఖాయం. ఈ సినిమాల్లో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
Aravinda sameta
Arvinda sametha vira ragav