2019 ఇయర్ మొదలు అయ్యి మొదటి నెల గడచి రెండో నెలలో ప్రస్తుతం ఉన్నాం. కాగా మొదటి నెలలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని క్రేజీ సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాగా అందులో కొన్ని మాత్రమె ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాయి. ఓవరాల్ గా కొన్ని సినిమాలు హిట్ టాక్ తో ఫ్లాఫ్ గా మిగిలి పోగా కొన్ని ఫ్లాఫ్ టాక్ తో నూ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటాయి.
మొత్తం మీద 2019 మొదటి నెలలో హిట్స్ అండ్ ఫ్లాఫ్ మూవీస్ ని గమనిస్తే…
ఎన్టీఆర్ కథానాయకుడు: జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 70.5 కోట్ల బిజినెస్ కి 20.4 కోట్ల వరకు షేర్ ని అందుకుని ఏకంగా 50.1 కోట్ల నష్టాలతో ఆల్ టైం డిసాస్టర్ గా మిగిలి పోయింది. హిట్ టాక్ తో భారీ ఫ్లాఫ్ అయిన సినిమా ఇదే.
పేట: జనవరి 10 న రిలీజ్ అయిన ఈ డబ్బింగ్ మూవీ నిర్మాతల అనవసరపు కాంట్రవర్సీ తో చాలినన్ని థియేటర్స్ ని దక్కించుకోలేక 13 కోట్ల బిజినెస్ కి కేవలం 6 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని 7 కోట్ల నష్టాలతో డిసాస్టర్ గా మిగిలింది. ఒక్క వారం ఆలస్యంగా వచ్చిన పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది.
వినయ విదేయ రామ: జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మంత్ బిగ్గెస్ట్ మూవీ రామ్ చరణ్ వినయ విదేయ రామ ప్రేక్షకులను భారీ గా అలరించి రికార్డుల దుమ్ము లేపుతుంది అని అంతా భావించినా సినిమా భారీ షాక్ ఇచ్చింది.
తొలి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నా టోటల్ రన్ లో 63 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని ఫ్లాఫ్ టాక్ తో అత్యధిక షేర్ అందుకున్న తెలుగు సినిమాగా నిలిచినా కానీ 90 కోట్ల బిజినెస్ లో 27 కోట్ల లాస్ తో ఈ సినిమా కూడా డిసాస్టర్ గా మిగిలిపోయింది.
ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్: జనవరి 12 న మిగిలిన పెద్ద సినిమాలతో పోల్చితే కొంచం మీడియం రేంజ్ మూవీ గా బరిలోకి దిగిన ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము లేపి సంక్రాంతి విన్నర్ గా నిలిచి సత్తా చాటింది.
సినిమా 34.5 కోట్ల బిజినెస్ కి ఆల్ మోస్ట్ 80 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచే రేంజ్ లో 45.5 కోట్ల రేంజ్ ప్రాఫిట్ తో తెలుగు సినిమా చరిత్రలో మూడో బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది.
మిస్టర్ మజ్ను: జనవరి నెల చివర్లో వచ్చిన మిస్టర్ మజ్ను మంచి టాక్ నే సొంతం చేసుకున్నా వీకెండ్ తర్వాత జోరు చూపలేక చేతులు ఎత్తేసింది. 22 కోట్ల బిజినెస్ కి ఓవరాల్ గా 11 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా మిగిలిపోబోతుంది ఈ సినిమా.
ఇవీ మొత్తం మీద 2019 జనవరి నెలలో తెలుగు మరియు డబ్బింగ్ సినిమాల పెర్ఫార్మెన్స్… మొత్తం మీద మొదటి వారం లో అలాగే మూడో వారం లో కొత్త సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. ఇక మొత్తం మీద ఈ మంత్ పెర్ఫార్మెన్స్ ని సింపుల్ గా గమనిస్తే…
హిట్స్: ఏమి లేవు
సూపర్ హిట్స్: ఏమి లేవు
బ్లాక్ బస్టర్స్: ఏమి లేవు
డబుల్ బ్లాక్ బస్టర్స్: ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
ఫ్లాఫ్స్: ఏమి లేవు
అట్టర్ ఫ్లాఫ్స్: ఏమి లేవు
డిసాస్టర్స్: పేట, వినయ విదేయ రామ, మిస్టర్ మజ్ను
ఆల్ టైం డిసాస్టర్: ఎన్టీఆర్ కథానాయకుడు
మూవీ ఆఫ్ ది మంత్: ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
ఇవీ మొత్తం మీద 2019 జనవరి నెలలో సినిమాల ఫైనల్ రిజల్ట్ లు… ఉన్నంతలో మిగిలిన సినిమాలతో వచ్చిన లాస్ ని కొంతవరకు ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ భారీ లాభాలతో తేరుకునేలా చేసింది. ఇక ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యే సినిమాల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో వచ్చే నెలలో తెలుసుకుందాం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.