సంక్రాంతి మూవీస్ రిలీజ్ డేట్స్ ఇవే…

12
499

  2019 సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో ఉండబోతుంది…ఒకటి కి మించిన సినిమాలు ఒకటి పోటి లో నిలవబోతుండగా ప్రేక్షకులు అన్ని సినిమాలను కవర్ చేయడానికి డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. మిగిలిన సీజన్స్ తో పోల్చితే పోటి ఎంత ఉన్నా కానీ టాక్ వస్తే అన్ని సినిమాలకు అల్టిమేట్ కలెక్షన్స్ వచ్చే సీజన్ సంక్రాంతి సీజన్ మాత్రమె అని చెప్పాలి. అది గత కొన్నేళ్ళుగా నిజం అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా అవ్వాలని అందరు కోరుకుంటున్నారు.

మొత్తం మీద రేసులో 3 తెలుగు సినిమాలు ఉండగా ముందుగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా జనవరి 9 న రిలీజ్ కాబోతుంది, ఆ తర్వాత జనవరి 11 రామ్ చరణ్ వినయ విదేయ రామ ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా…జనవరి 12 న…

వెంకటేష్ వరుణ్ తేజ్ ల F2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూడు సినిమాలతో పాటు ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ నటిస్తున్న పేట కూడా జనవరి 10 న తెలుగు తమిళ్ లో ఏక కాలంలో రిలీజ్ కానుంది. దాంతో 4 రోజులు నాలుగు పెద్ద సినిమాలతో సంక్రాంతి పోరు చాలా గట్టిగానే జరగబోతుంది. మరి ఈ సినిమాల్లో మీరు ఎ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

12 COMMENTS

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!