Home న్యూస్ 2021 సంక్రాంతికి అఫీషియల్ గా కన్ఫాం అయిన సినిమాలు ఇవే!

2021 సంక్రాంతికి అఫీషియల్ గా కన్ఫాం అయిన సినిమాలు ఇవే!

1178
0

 

2020 ఇయర్ సగం పూర్తి అయ్యి రెండో సగం లో కూడా ఒక నెల గడిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది అత్యద్భుతంగా ప్రారంభం అయినా కానీ ఫాస్ట్ క్వార్టర్ పూర్తి అయిన తర్వాత కరోనా ఎఫెక్ట్ తో సినిమాలు లేక రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా సినిమాలు అన్నీ కూడా నిరవధికంగా పోస్ట్ పోన్ అయ్యాయి. పరిస్థితి ఎప్పటికి చక్కదిద్దుకుంటుందో ఇంకా చెప్పలేం కానీ ఇయర్ ఎండ్ కి మాత్రం…

Tollywood Actors Top Anniversary Trends

అంతా సద్దుకుంటుంది అని అందరూ నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే ఈ ఇయర్ ని ఇక వదిలేసి వచ్చే ఏడాది సంక్రాంతి ని మళ్ళీ నమ్ముకోవాలని చూస్తున్నారు అందరూ. అందులో భాగంగా ఇప్పుడు రెండు సినిమాలు అఫీషియల్ గా సంక్రాంతి రిలీజ్ ని కన్ఫాం చేసుకున్నాయి.

రీసెంట్ గా యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న కొత్త సినిమా రంగ్ దే సినిమా ను అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి 2021 రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసి టీసర్ రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే, కాగా ఇప్పుడు లేటెస్ట్ గా అఖిల్ అక్కినేని పూజా హెడ్గే ల కాంబినేషన్ లో…

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ను కూడా సంక్రాంతి కి రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ ని రిలీజ్ చేశారు నిర్మాత గీత ఆర్ట్స్ వారు. దాంతో ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి అఫీషియల్ గా సంక్రాంతి రిలీజ్ ని కన్ఫాం చేసుకోగా మరికొన్ని సినిమాలు రేసులో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

నాగ చైతన్య లవ్ స్టొరీ, పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలు కూడా రేసులో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సమ్మర్ కి అనుకున్న రెడ్, వి ది మూవీ, క్రాక్, వకీల్ సాబ్ మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్ లు ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది. అందులో కొన్ని ఈ ఏడాది ఎండ్ కి రావచ్చు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here