2022 ఇయర్ మొదలు అయ్యి ఒక నెల కూడా గడచి పోయింది. ఫస్ట్ నెలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సందడి కేవలం 3 రోజులకు మాత్రమే పరిమితం అవ్వగా పాన్ ఇండియా మూవీస్ తో కలెక్షన్స్ జాతర ఆల్ ఇండియా లెవల్ లో దుమ్ము లేచి పోవాల్సింది కానీ థార్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన సినిమాలు అన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో ఉన్నంతలో సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు మాత్రమే థియేటర్స్ లో…..
కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది కానీ అనుకున్న రేంజ్ లో రీచ్ ని అందుకోలేక పోయింది…. అన్ని ఇండస్ట్రీలలో పరిస్థితులు అంతంత మాత్రమే ఉండగా చాలా చోట్ల థియేటర్స్ ని మూసెయ్యడం, 50% ఆక్యుపెన్సీలు లాంటివి ఉండటం తో సినిమాలు రిలీజ్ కి నోచు కోలేని పరిస్థితి ఉండేది…
తెలుగు రాష్ట్రాలలో పండగ సెలవుల తర్వాత 50% ఆక్యుపెన్సీ చేయగా ఈ లోపు బంగార్రాజు సందడి చేసింది…. ఈ సందడి ఇప్పుడు ఈ నెల కి గాను టాలీవుడ్ తరుపున హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవడమే కాకుండా ఈ ఇయర్ లో మొదటి నెలలో ఇండియా వైడ్ గా కూడా…
ఏ సినిమా లేని కారణంగా నంబర్ 1 కలెక్షన్స్ తో టాప్ లో నిలిచేలా చేసింది అని చెప్పాలి. ముందే చెప్పినట్లు అసలు ఇతర ఇండస్ట్రీలలో రిలీజ్ కి సినిమాలు లేక పోవడంతో టోటల్ ఇండియా వైడ్ గా జనవరి నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఒకే ఒక్క పెద్ద సినిమా గా బంగార్రాజు నిలవగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో సినిమా బాగానే షేక్ కూడా…
చేసింది అని చెప్పాలి. నైజాం ఏరియాలో కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయకుండా ఉండి ఉంటే సినిమా ఈ పాటికే లాభాల బాట పట్టి ఉండేది అని చెప్పాలి. ఇక ఫిబ్రవరి నెలలో వరుస పెట్టి రిలీజ్ లను అనౌన్స్ చేస్తున్నారు. మరి ఈ నెల నుండి పరిస్థితులు నార్మల్ అయ్యి అన్ని ఇండస్ట్రీలు తిరిగి ఓపెన్ అయ్యి కలెక్షన్స్ రచ్చ చేయడం స్టార్ట్ చేస్తే అదే చాలు అని చెప్పాలి.