బాక్ ఆఫీస్ దగ్గర ఈ ఇండిపెండెన్స్ వీకెండ్ లో హిందీ సినిమాలు 2 అలాగే కోలివుడ్ మూవీ ఒకటి….తెలుగు మూవీ ఒకటి రిలీజ్ అయ్యాయి. తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన భోలా శంకర్(Bholaa Shankar) సినిమా రిలీజ్ అవ్వగా…
తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) హిందీలో సన్నీ డియోల్(Sunny Deol) నటించిన గదర్2(Gadar2) సినిమా అలాగే అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన OMG2 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అన్ని సినిమాల్లో గదర్2 మరియు జైలర్ సినిమాలు ఊరమాస్ లెవల్ లో రాంపేజ్ ను చూపించగా OMG2 సినిమా కూడా ఉన్నంతలో మంచి జోరుని చూపించింది కానీ మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ మాత్రం తెలుగు తరుపున ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక చేతులు ఎత్తేసింది.
అయినా కానీ ఈ నాలుగు సినిమాలు కలిపి ఇండిపెండెన్స్ వీక్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా ఈ నాలుగు సినిమాలు ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 1019 కోట్ల మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించడం విశేషమని చెప్పాలి.
ఒకసారి అన్ని సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే…
2023 Independence Week Indian Movies WW Gross
👉#Jailer – 449.75CR(9 Days)
👉#Gadar2 – 396CR~(8 Days)
👉#OMG2 – 130CR~(8 Days)
👉#BholaaShankar – 43.55CR(8 Days)
Total WW Collections – 1,019.30CR
అన్ని సినిమాలు కుమ్మేశాయి. కానీ తెలుగు మూవీ భోలా శంకర్ కూడా జోరు చూపించి ఉంటే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగి ఉండేది. మిగిలిన సినిమాల్లో జైలర్ సూపర్ రాంపేజ్ ను కొనసాగిస్తూ ఉండగా ఈ వీకెండ్ లో ఈ సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తాయో చూడాలి.