Home న్యూస్ 2024 లో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ సాధించిన సినిమాలు….దేవర భీభత్సం!!

2024 లో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ సాధించిన సినిమాలు….దేవర భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 ఇయర్ లో ఆడియన్స్ అంచనాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు తక్కువే రిలీజ్ అవ్వగా వాటిలో కూడా కొన్ని మాత్రమే లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నాయి. మొత్తం మీద ఇయర్ మొదట్లో హనుమాన్ మూవీ ఊరమాస్ లాంగ్ రన్ ను అందుకోగా…

అదే టైంలో మిక్సుడ్ టాక్ తో గుంటూరు కారం డీసెంట్ రన్ ను సొంతం చేసుకుంది. సమ్మర్ టైంలో టిల్లు స్క్వేర్ మూవీ ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా తర్వాత కల్కి మూవీ ఎపిక్ లాంగ్ రన్ ను సాధించింది…ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మిక్సుడ్ రెస్పాన్స్ తో…

కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 19 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…అలాగే ఈ ఏడాదికి గాను హనుమాన్ మూవీ తర్వాత ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంది.

Devara Movie 20 Days Total World Wide Collections!!

రిలీజ్ అయిన రోజు నుండి లెక్క చూసుకుంటే హనుమాన్ మూవీ ని సమం చేసినప్పటికీ ప్రీమియర్స్ తో కలిపి హనుమాన్ మూవీ 20 రోజులు నాన్ స్టాప్ దండయాత్ర చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర…ఇక ఓవరాల్ గా 2024 ఇయర్ లో ఎక్కువ రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే..

AP TG 1cr Plus Continuous Share Movies 2024
👉#HanuMan – 20 Days(inc premieres)
👉#Devara – 19 Days******
👉#Kalki2898AD – 13 Days
👉#GunturKaaram – 10 Days
👉#TilluSquare – 10 Days
👉#NaaSaamiRanga – 6 Days
👉#SaripodhaaSanivaaram – 6 Days
👉#Saindhav – 4 Days
👉#OmBheemBush – 4 Days
👉#Vettaiyan – 4 Days*****

మొత్తం మీద ఈ లిస్టులో ఉన్న మూవీస్ లో దేవర మూవీ మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఊహకందని ఊచకోత కోసింది ఇప్పుడు. రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో సైతం బెస్ట్ రన్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది దేవర మూవీ…

Devara Movie 2 Weeks(14 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here