2024 ఇయర్ టాలీవుడ్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది కానీ తర్వాత ఎలక్షన్స్ వలన అనుకున్న రేంజ్ లో సినిమాలు రాలేదు….దాంతో ఇతర ఇండస్ట్రీలు జోరు చూపిస్తున్న చోట టాలీవుడ్ సైలెంట్ అయింది. కానీ ఇయర్ ఎండ్ టైంకి చూసుకుంటే టాలీవుడ్ తరుపున కొన్ని సినిమాలు అనుకున్న అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి…
కాగా ఈ ఇయర్ లో తెలుగు సినిమాల పరంగా సాలిడ్ గా లాభాలను సొంతం చేసుకున్న సినిమాల విషయానికి వస్తే ఇయర్ మొదట్లో హనుమాన్ మూవీ ఊహకందని లాభాలను అందుకుంది. తర్వాత టిల్లు స్క్వేర్ మూవీ ఊరమాస్ హిట్ గా నిలిచింది…
తర్వాత సైలెంట్ అయిపోయిన టాలీవుడ్ తిరిగి కల్కి మూవీ ఎపిక్ హిట్ అండ్ ప్రాఫిట్స్ తో అల్టిమేట్ ఊపు ఇస్తే ఆ తర్వాత కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ లాంటి చిన్న సినిమాలు మంచి లాభాలను అందుకోగా తర్వాత వచ్చిన దేవర మూవీ మిక్సుడ్ రెస్పాన్స్ తోనే సాలిడ్ లాభాలను అందుకుంది.
ఇక దీపావళి కి వచ్చిన క, లక్కీ భాస్కర్ లాంటి తెలుగు సినిమాలు కుమ్మేసే లాభాలను అందుకున్నాయి…ఇక ఇయర్ ఎండ్ కి పుష్ప2 మూవీ అన్ని రికార్డుల బెండు తీసి ఊహకందని లాభాలతో దూసుకు పోతూ ఉండగా మొత్తం మీద ఈ ఇయర్ టాప్ ప్రాఫిట్స్ ను అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
2024 Tollywood Most Profitable Films
👉#Pushpa2TheRule: 182CR(617CR)*******
👉#Kalki2898AD: 169.25CR(370CR)
👉#HanuMan: 127.95CR(29.65CR)
👉#Devara: 74.60CR(182.25Cr)
👉#TilluSquare – 42Cr(27Cr)
👉#Amaran(Dub) – 23CR(5CR)
మొత్తం మీద ఈ సినిమాలు టాలీవుడ్ లో ఈ ఇయర్ సాలిడ్ లాభాలతో దుమ్ము లేపాయి…ఇయర్ కి ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా ఇయర్ ఎండ్ కి వచ్చే సరికి ఇండియన్ మూవీస్ లో ఏ ఇండస్ట్రీకి సొంతం అవ్వని రేంజ్ లో కలెక్షన్స్ తో మాస్ జాతర చేసింది టాలీవుడ్…
ఈ రేంజ్ లో ఇయర్ ఎండ్ అవుతుందని ఇయర్ మిడిల్ లో ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు…ముఖ్యంగా పెద్ద సినిమాలు అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఔట్ పెర్ఫార్మ్ చేయడం టాలీవుడ్ కి కలిసి వచ్చింది. ఇక 2025 ఇయర్ లో టాలీవుడ్ కి ఇంతకుమించి కలిసి వస్తుందో లేదో చూడాలి.