Home న్యూస్ 2024 ఇండియా నంబర్ 1 కల్కి….రెబల్ స్టార్ దెబ్బకి రికార్డులు ఔట్!

2024 ఇండియా నంబర్ 1 కల్కి….రెబల్ స్టార్ దెబ్బకి రికార్డులు ఔట్!

0

ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా ఫస్టాఫ్ లో చాలా లిమిటెడ్ సినిమాలే రిలీజ్ అయ్యాయి…టాలీవుడ్ తరుపున 2 సూపర్ హిట్స్ పడగా మిగిలిన సినిమాలు అంచనాలను అందుకోలేదు. హిందీ సినిమాలలో కొన్ని మాత్రమే మెప్పించగా మలయాళ సినిమాలు లాంగ్ రన్ లో దుమ్ము లేపగా ఓపెనింగ్స్ ఓకే అనిపించేలానే సొంతం అయ్యాయి. ఇలాంటి టైం ఎలక్షన్స్ అండ్ IPL సీజన్ ఇంపాక్ట్ ల తర్వాత….

ఎట్టకేలకు పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD Movie) భారీ హైప్ నడుమ రిలీజ్ అయ్యి అల్టిమేట్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని దక్కించుకుంది.. అదే క్రమంలో సినిమా ఇప్పుడు మొదటి రోజు ఏకంగా 183 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ పరంగా ఈ సినిమా హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాగా నిలిచి ఈ ఏడాదికి రికార్డ్ ను నమోదు చేసింది. లాస్ట్ ఇయర్ కూడా రెండు సార్లు రికార్డ్ కొట్టిన ప్రభాస్ ఈ సారి మరోసారి ఈ ఏడాదికి రికార్డ్ ఓపెనింగ్స్ ను ఇండియన్ మూవీస్ లో అందుకుని సంచలనం సృష్టించగా…

ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాలను గమనిస్తే…
2024 Indian Movies WW Top Gross Openings

👉#Kalki2898AD – 183.20CR*******
👉#GunturKaaram – 79.30CR
👉#Fighter – 35.65CR~
👉#BadeMiyanChoteMiyan – 32CR~
👉#HanuMan – 24.50CR
👉#TilluSquare – 23.70CR
👉#Shaitaan – 21.75CR

మొత్తం మీద టాలీవుడ్ నుండే ఈ ఏడాది కి గాను ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో గుంటూరు కారం ఇది వరకు టాపర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డును రెండురెట్లకి పైగా భారీ మార్జిన్ తో బ్రేక్ చేసిన కల్కి ఈ ఏడాది 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది…. ఇక ఈ ఇయర్ ఎండ్ వరకు ఇంకా ఎన్ని సినిమాలు సాలిడ్ జోరుని ఇలానే చూపిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here