బాక్స్ ఆఫీస్ దగ్గర 2025 ఇయర్ లో ఇప్పటి వరకు 4 నెలలు పూర్తి అవ్వగా 5వ నెలలో ఉన్నాం….సమ్మర్ వరుస సినిమాలతో ఫుల్ జోరుగా సాగాల్సింది కానీ ఏప్రిల్ నెలలో ఒక్క సినిమా కూడా అంచనాలను అందుకోలేక పోయింది. ఎట్టకేలకు మే నెలలో ఒక మంచి హిట్ టాలీవుడ్ కి సొంతం అయ్యింది.
ఓవరాల్ గా ఈ ఇయర్ లో టాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లో ఓవరాల్ గా 8 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్స్ గా నిలిచాయి…ఒక సినిమా క్లీన్ హిట్ కి ఆల్ మోస్ట్ దగ్గరగా వచ్చి జస్ట్ లో మిస్ అయింది. జనవరి నెలలో టాలీవుడ్ బెస్ట్ రెవెన్యూ ని సొంతం చేసుకుంది..
ఫిబ్రవరి అండ్ మార్చ్ కూడా పర్వాలేదు అనిపించగా ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో కొన్ని మీడియం రేంజ్ మూవీస్ రిలీజ్ అయినా కూడా ఏవి అంచనాలను అందుకోలేక పోయాయి… ఓవరాల్ గా ఇప్పుడు మే లో హిట్3 మళ్ళీ హిట్ గీతని దాటింది.
ఒకసారి ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హిట్స్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే…
2025 Tollywood Hit Movies
👉#SankranthikiVasthunam – HUGE BLOCK BUSTER
👉#Thandel – SUPER HIT
👉#CourtStateVsNobody – HUGE BB
👉#MadSquare – Block Buster
👉#HIT3 – HIT*******
Dub Hits
👉#MARCO – SUPER HIT
👉#Chhaava – HUGE BB
👉#ReturnOfTheDragon – HUGE BB
(Semi Hit to HIT)
👉#DaakuMaharaj
ఓవరాల్ గా ఈ సినిమాలు ఈ ఇయర్ ఆడియన్స్ ను ఉన్నంతలో బాగా ఆకట్టుకున్న మూవీస్ …ఇక లాస్ట్ ఇయర్ 5 నెలలో ఆల్ మోస్ట్ 9-10 సినిమాలు హిట్ గీతని దాటాయి. ఇక ఈ నెల ఎండ్ అయ్యే టైం కి రిలీజ్ అయ్యే ఇతర సినిమాలు హిట్ అయితే ఈ లెక్క పెరగవచ్చు. ఇక ఇయర్ ఎండ్ వరకు చాలా సినిమాలు ఈ లిస్టులో చేరాలని కోరుకుందాం…