Home న్యూస్ 20 రోజుల ముందే 5 కోట్లు ఔట్…టైగర్ జోరు మాములుగా లేదుగా!!

20 రోజుల ముందే 5 కోట్లు ఔట్…టైగర్ జోరు మాములుగా లేదుగా!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా చేస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన దేవర(Devara Part 1) భారీ క్రేజ్ నడుమ సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో ఆల్ రెడీ క్రేజ్ సాలిడ్ గా ఉంది…

ఇక సినిమా రిలీజ్ కి 25 రోజుల ముందే ఓవర్సీస్ లో లిమిటెడ్ లోకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా అద్బుతమైన బుకింగ్స్ తో మాస్ జోరు చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 20 రోజుల టైం ఉండగానే ఇప్పుడు నార్త్ అమెరికా మరియు…

యూరప్ ఏరియాల్లో బుకింగ్స్ పరంగా దుమ్ము లేపే రేంజ్ లో జోరు ని చూపెడుతూ ఆల్ మోస్ట్ 5 లక్షల 60 వేల రేంజ్ లో డాలర్స్ మార్క్ ని దాటేసి హాల్ఫ్ మిలియన్ మార్క్ కి క్లోజ్ గా వెళుతుంది. అన్ని చోట్లా బుకింగ్స్ లో మాస్ జోరు కనిపిస్తూ ఉండటం తో…

ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో ఈ సినిమా మాస్ భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్స్ తో సినిమా 2.5-3 మిలియన్ డాలర్స్ రేంజ్ గ్రాస్ ను ఓవర్సీస్ లో…

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ప్రజెంట్ బుకింగ్స్ ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 5 కోట్ల గ్రాస్ మార్క్ కి దగ్గరగా వచ్చి సంచలనం సృష్టించింది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది బుకింగ్స్ లో ఇంకా జోరు పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అన్ని చోట్లా సినిమా మీద క్రేజ్ మరింతగా పెరిగి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఓవరాల్ గా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా దేవర మూవీ రికార్డ్ లెవల్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here