మంచి కలెక్షన్స్ తో సమ్మర్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ మూడో వీక్ ని మంచి కలెక్షన్స్ తోనే ఇప్పుడు కంప్లీట్ చేసుకుని పనిలో ఉండగా ఓవరాల్ గా సినిమా ఆల్ రెడీ శ్రీ విష్ణు కెరీర్ లో హైయెస్ట్ షేర్ ని అందుకుని…
మాస్ రచ్చ చేయగా ఇప్పుడు హైయెస్ట్ గ్రాస్ మార్క్ ని అందుకోవడానికి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా 20వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ…
13 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 14 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా 30 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సింగిల్ మూవీ ఇప్పుడు…
20 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 20 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.89Cr~
👉Ceeded: 1.53Cr
👉Andhra: 6.13Cr~
AP-TG Total:- 13.55CR(25.00CR~ Gross)
👉KA+ROI+OS : 3.76CR****approx
Total WW Collections: 17.31CR(Gross – 33.25CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 10.31 కోట్ల రేంజ్ లో సాలిడ్ లాభాన్ని సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి వసూళ్ళని అందుకుంటుందో చూడాలి.