ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ 1730 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి ఇప్పటికీ మంచి జోరుని చూపెడుతూ ఉండగా సినిమా 5వ వారం వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగానే స్లో డౌన్ అవుతున్న టైంలో…
ఇక సంక్రాంతి సినిమాల కోసం పుష్ప2 మూవీ దారి వదలక తప్పదు అని అనుకుంటూ ఉన్న టైంలో సినిమా టీం ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చారు…రీసెంట్ గా సినిమా రన్ టైం కి ఇంకా ఫూటేజ్ ను యాడ్ చేయాలని భావిస్తున్నారని వార్తలు రాగా…
ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ సినిమా లో మరో 20 నిమిషాల స్పెషల్ ఫూటేజ్ ను రీ యాడ్ చేసి రీ లోడెడ్ వర్షన్ ను రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సంక్రాంతి జనవరి 11 న నుండి తెలుగు వర్షన్ కుదిరితే హిందీ వర్షన్ కి గాను సినిమా రీ ఎడిటెడ్ వర్షన్ ను…
థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని ఓవరాల్ గా అందుకున్నా కూడా…చాలా సెంటర్స్ లో భారీ రేటు వలన ఫుల్లుగా రికవరీ అవ్వాల్సి ఉంది… కానీ సంక్రాంతి టైంలో ఉన్న సినిమాల మధ్య పుష్ప2 కి…
ఎంతవరకు థియేటర్స్ సొంతం అవుతాయి అలాగే ఆ థియేటర్స్ లో రీ ఎడిటెడ్ వర్షన్ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో అన్నది ఆసక్తిగా మారగా…ఒకవేళ ఆడియన్స్ కి కనుక రీ ఎడిట్ వర్షన్ నచ్చితే ఈ సారి మరీ ఎక్కువగా సినిమాల మధ్య పోటి లేక పోవడంతో…
పుష్ప2 కి ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. హిందీ లో అయితే అసలు పోటి నే లేదు కాబట్టి అక్కడ కనుక ఇది వర్కౌట్ అయితే రచ్చ మరో రేంజ్ లో ఉంటుంది. మరి సినిమా ఈ అడ్వాంటేజ్ ను ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి.