Home న్యూస్ 2వ రోజుకే 20 నిమిషాలు ఔట్….ముందే చూసుకుంటే ఇలా అయ్యేది కాదుగా!!

2వ రోజుకే 20 నిమిషాలు ఔట్….ముందే చూసుకుంటే ఇలా అయ్యేది కాదుగా!!

0

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie) సినిమా చాలా టైంగా రూపొందిన సినిమా..మధ్యలో బడ్జెట్ ప్రాబ్లంస్ వలన సినిమా ఆగిపోగా కమల్ హాసన్ విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టడంతో తిరిగి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు అవ్వగా సడెన్ గా సీక్వెల్ కాస్తా..

మరో పార్ట్ గా కూడా మారింది….దాంతో రెండో పార్ట్ లో కథ పెద్దగా లేక పోయినా కూడా ఏకంగా 3 గంటల రన్ టైంతో సినిమాను కట్ చేసి రిలీజ్ చేశారు…దాంతో సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని అసలు ఇది శంకర్ కమల్ ల కాంబో సినిమా నా అన్న అనుమానాలు రేకెత్తేలా చేసింది…

ఇక సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ మరియు రన్ టైం మరీ ఎక్కువ అవ్వడంతో చూసిన ఆడియన్స్ కథ భారీగా డ్రాగ్ అయ్యిందని, చాలా సీన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి అంటూ కామెంట్స్ వినిపించడంతో మేకర్స్ ఇప్పుడు రెండో రోజుకే సినిమా రన్ టైంని తగ్గించాలని డిసైడ్ అయ్యారు…

Indian2-Bharateeyudu2 1st Day Total World Wide Collections!

మొత్తం మీద 3 గంటల రన్ టైం ఉన్న సినిమాలో ఆల్ మోస్ట్ 20 నిమిషాలకు పైగా రన్ టైంని తగ్గించారని, అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా కొన్ని మార్పులు చేశారని…ఈ ఎడిటెడ్ వర్షన్ ఇప్పుడు వీకెండ్ తర్వాత నుండి థియేటర్స్ లో ప్రదర్శితం కాబోతుందని అంటున్నారు…

కానీ ఇలా సినిమా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకునే దాకా వెయిట్ చేయడం ఎందుకని…రిలీజ్ కి ముందే రన్ టైంని తగ్గించి క్రిస్ప్ రన్ టైంతో సినిమాను రిలీజ్ చేసి ఉంటే, మరీ టాక్ ఈ రేంజ్ లో మిక్సుడ్ లెవల్ లో వచ్చి ఉండేది కాదని, మినిమమ్ ఎబో యావరేజ్ లెవల్ లో అయినా ఉండేదని అంటున్నారు. ఇక ఈ ఎడిట్ చేసిన వర్షన్ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Bharateeyudu2 1st Day Telugu Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here