నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో వీకెండ్ తర్వాత మళ్ళీ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన తర్వాత సోమవారం మళ్ళీ సాలిడ్ గా హోల్డ్ చేసిన సినిమా మంచి గ్రోత్ ని చూపెట్టిన సినిమా ఇప్పుడు 20 వ రోజు లో ఎంటర్ అయిన సినిమా…
మరోసారి డీసెంట్ గా హోల్డ్ చేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30% వరకు డ్రాప్ అయింది అని చెప్పాలి. కానీ చోట్ల షోలు కూడా పెంచగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడగా ఓవరాల్ గా సినిమా మరోసారి మంచి వసూళ్లు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 30 లక్షలకు అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. 20 వ రోజు సినిమా ఈ రేంజ్ వసూళ్ళని సొంతం చేసుకోవడం కూడా విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 రోజుల్లో అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇక.