బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా మూడో వీక్ లో వర్కింగ్ డేస్ లో కూడా సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతూ రన్ ని కొనసాగించింది…ఈ క్రమంలో వర్కింగ్ డేస్ లో కూడా సినిమా…
చాలా లిమిటెడ్ డ్రాప్స్ తోనే హోల్డ్ ని కొనసాగించింది. కొత్త సినిమాలు అన్నీ జనాలను ఆకర్షించడం విఫలం అవ్వగా ఒక్క దేవర మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జోరుని కొనసాగిస్తూ ఉండగా సినిమా 20వ రోజున ఆశ్యర్యకరంగా ఫుల్ వర్కింగ్ డే లో ఉన్నప్పటికీ కూడా….
కొన్ని చోట్ల థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషమని చెప్పాలి. సినిమా కోస్టల్ ఆంధ్రలో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. రాయలసీమ ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గా కొనసాగించింది… విజయనగరం ఏరియాలో సినిమాకి 20వ రోజున ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో పాటు…
హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి, అలాగే నంద్యాల ఏరియాలో సినిమా ఆల్ మోస్ట్ హౌస్ ఫుల్ బోర్డులతో సినిమా 20వ రోజున దుమ్ము లేపింది. రీసెంట్ టైంలో ఇలాంటి హౌస్ ఫుల్స్ వర్కింగ్ డేస్ లో సొంతం చేసుకున్న రేర్ మూవీస్ లో దేవర ఒకటిగా నిలిచింది అని చెప్పాలి.
అది కూడా మొదటి రోజున సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా ఇలాంటి హోల్డ్ తో రన్ ని కొనసాగించిన సినిమా రీసెంట్ టైంలోనే ఏ టాప్ స్టార్ మూవీ కి సాధ్యం కాని రేంజ్ లో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోశాయి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.