బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ రాంపెజ్ ను లాంగ్ రన్ లో ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా అడ్డూ అదుపూ లేకుండా సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తూ మాస్ భీభత్సం సృష్టిస్తూనే ఉండటం విశేషం అని చెప్పాలి.
ఈ క్రమంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20వ రోజున ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలో 20వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో భారీ ఇండస్ట్రీ రికార్డ్ ను సృష్టించింది. సినిమాకి 20వ రోజున సండే అడ్వాంటేజ్ ఎంత కలిసి వచ్చినా కూడా…
ఓ మీడియం రేంజ్ మూవీ కి ఈ రేంజ్ లో వసూళ్లు సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. 20వ రోజు ఇది వరకు టాలీవుడ్ చరిత్రలో 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బాహుబలి2 సినిమా పేరిట ఉండేది. ఆ సినిమా 20వ రోజున మొత్తం మీద 1.56 కోట్ల రేంజ్ లో..
షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమా రికార్డ్ ఆల్ మోస్ట్ 8 ఏళ్ళుగా అలానే కొనసాగింది ఇప్పటి వరకు, ఎట్టకేలకు ఇప్పుడు 20వ రోజున సండే అడ్వాంటేజ్ రావడం తో దుమ్ము లేపే రేంజ్ లో జోరు చూపించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా..
సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది… 2.2 కోట్లు ఆ పైన షేర్ అనుకున్నా కూడా ఫైనల్ లెక్కలు చూస్తుంటే 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అవలీలగా సినిమా 20వ రోజున సోట్నం చేసుకుందని సమాచారం. ఓవరాల్ గా భారీ మార్జిన్ తో 20వ రోజున కొత్త రికార్డ్ నమోదు అయ్యింది ఇప్పుడు.