బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు ప్రతీ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండేవి, కానీ తర్వాత టైంలో చాలా కొద్ది సినిమాలు మాత్రమే లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంటూ పరుగును కొనసాగించడం కూడా కొద్ది సినిమాలకే సాధ్యం అవుతూ ఉండగా…
లేటెస్ట్ గా సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఎపిక్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ 20వ రోజున సండే అడ్వాంటేజ్ లభించగా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని..
ఏకంగా టాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డ్ ను సైతం నమోదు చేసి సంచలనం సృష్టించింది. 2.31 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ ఊచకోత కోస్తూ 20వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారిగా 2 కోట్ల షేర్ మార్క్ ని దాటిన సినిమాగా రికార్డ్ ను సృష్టించింది ఇప్పుడు.
ఒకసారి 20వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
AP-TG 20th Day Highest Share Movies
👉#SankranthikiVasthunam– 2.31CR******
👉#Baahubali2 – 1.56CR
👉#Pushpa2TheRule – 1.48Cr
👉#AttarintikiDaredi – 1.43Cr~
👉#Baahubali – 1.10CR~
👉#Kalki2898AD – 1.01CR
👉#Balagam – 84L
👉#HanuMan – 84L
👉#Devara – 82L
👉#KGFChapter2 – 81L
👉#VenkyMama – 81L
👉#Maharshi – 53L
👉#Kanthara – 50L
కేవలం 6 సినిమాలు మాత్రమే 20వ రోజున కోటికి పైగా షేర్ మార్క్ ని అందుకోగా అందులో ఫస్ట్ 2 కోట్ల మార్క్ ని దాటిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాస్ రికార్డ్ ను సృష్టించింది. ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం అంటే కష్టమే అని చెప్పాలి.