టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బింగ్ సినిమాలు అప్పుడప్పుడు రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ ని కొన్ని సినిమాలు అందుకున్నాయి…ఇప్పట్లో కొన్ని సినిమాలు ఊహకందని విజయాన్ని అందుకోగా అప్పట్లో 2005 టైంలో ఆడియన్స్ ముందుకు చంద్రముఖి, గజినీ లాంటి సినిమాలు రచ్చ చేయగా వాటితో పాటు…
శంకర్ డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా రూపొందిన అపరిచితుడు(Aparichitudu Movie) సినిమా ఊహకందని రాంపెజ్ ను చూపించింది. డబ్బింగ్ సినిమాల పరంగా ఆ టైంలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఈ సినిమా సంచలనం సృష్టించింది…
అప్పటి వరకు ఆ ఏడాది గజినీ మరియు చంద్రముఖి లాంటి సినిమాలు బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేయగా అపరిచితుడు సినిమా ఆల్ మోస్ట్ 7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుని రికార్డ్ కొట్టగా టోటల్ రన్ లో అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా…
14 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని 24 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది. టోటల్ రన్ లో బిజినెస్ మీద డబుల్ ప్రాఫిట్ తో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా తమిళనాడులో టోటల్ రన్ లో 30 కోట్ల రేంజ్ లో..
గ్రాస్ ను అందుకుంటే తెలుగు లో కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో రచ్చ లేపడం విశేషం. వరల్డ్ వైడ్ గా కూడా ఆల్ మోస్ట్ 78 కోట్ల రేంజ్ లో వసూళ్ళని గ్రాస్ రూపంలో అందుకోగా షేర్ పరంగా 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది..
తెలుగు లో సాలిడ్ లాంగ్ రన్ ను అందుకున్న సినిమా ఏకంగా 37 సెంటర్స్ లో 100 డేస్ ను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది. సాలిడ్ రికార్డులతో దుమ్ము దుమారం లేపిన అపరిచితుడు రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి అవ్వగా విక్రమ్ ఇప్పటికీ కూడా మళ్ళీ అపరిచితుడు రేంజ్ హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాడని చెప్పాలి.