బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ మూవీ పుష్ప రెండో వారంలో సెన్సేషనల్ హోల్డ్ ని చూపెడుతుంది. సినిమా 8 వ రోజు తో పోల్చితే 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ గ్రోత్ ని దక్కించుకుంది. సినిమా 8 వ రోజు తో పోల్చితే 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1 కోటికి పైగా గ్రోత్ ని సొంతం చేసుకుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు 2.38 కోట్ల షేర్ ని అందుకుంటే 9వ రోజు 3.43 కోట్ల షేర్ ని సాధించి ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా…. దాంతో సినిమా టోటల్ కలెక్షన్స్ లెక్క రెండు తెలుగు రాష్ట్రాలలో 70 కోట్ల షేర్ మార్క్ ని…
అధిగమించి 73కోట్ల మార్క్ ని అందుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 6.61 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం మెంటల్ మాస్ అనే చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు….
పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 35.70Cr(inc GST)
👉Ceeded: 12.25Cr
👉UA: 6.66Cr
👉East: 4.19Cr
👉West: 3.46Cr
👉Guntur: 4.48Cr
👉Krishna: 3.64Cr
👉Nellore: 2.67Cr
AP-TG Total:- 73.05CR(112.03CR~ Gross)
👉Karnataka: 9.21Cr
👉Tamilnadu: 7.81Cr
👉Kerala: 4.10Cr(Corrected)
👉Hindi: 15.55Cr
👉ROI: 2.11Cr
👉OS – 11.90Cr
Total WW: 123.73CR(218CR~ Gross)
ఇదీ సినిమా 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.
సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 9 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 22.27 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. లాంగ్ రన్ లో సినిమా క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….