నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉన్నాడు, ఒకప్పుడు ఇదే రేంజ్ లో ఊపు చూపాడు కానీ మధ్యలో పడుతూ లేస్తూ సాగిన బాలయ్య కెరీర్ అఖండ, అన్ స్టాపబుల్ తర్వాత పీక్ స్టేజ్ కి చేరింది, దాంతో వీర సింహా రెడ్డి బాలయ్య కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుని ఊచకోత కోసింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ లో ఆల్ టైం టాప్ 15 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక మొదటి రోజు అన్ని రిపోర్ట్ అయిన కొన్ని ఏరియాల టోటల్ హైర్స్ కలెక్షన్స్ లెక్క…
4.26 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ హైర్స్ ను పక్కకు పెడితే సినిమా మొదటి రోజు వర్త్ షేర్ ఏకంగా 21.09 కోట్ల దాకా సొంతం చేసుకుని సీనియర్ హీరోల పరంగా సైరా సినిమా 24.72C(14.03C Hires) తర్వాత ప్లేస్ లో నిలిచింది అని చెప్పాలి.
అదే టైం ఓవరాల్ గా అన్ని సినిమాల్లో ఆల్ టైం టాప్ 11 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. అఖండ ముందు వరకు బాలయ్య మార్కెట్ చాలా తక్కువగా ఉండేది, అఖండ బ్లాక్ బస్టర్ అయినా ఓపెనింగ్స్ ఈ రేంజ్ లో సంచలనాలు సృష్టించలేదు, కానీ ఇప్పుడు వీర సింహా రెడ్డితో బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా శివతాండవం ఆడాడు అని చెప్పాలి.