మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి మూడో వారం చివర్లో ఉంది… సినిమా మూడో వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించగా మళ్ళీ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వడం తో మళ్ళీ స్లో డౌన్ అయింది. సండే తో పోల్చితే మండే కలెక్షన్స్ ఆల్ మోస్ట్ 60% కి పైగా తగ్గగా సినిమా ఇప్పుడు 21 వ రోజు లో ఎంటర్ అవ్వగా మరో వర్కింగ్ డే అవ్వడం తో…
మరోసారి డ్రాప్స్ గట్టిగానే కనిపించాయి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 వ రోజు తో పోల్చితే 21 వ రోజు మొత్తం మీద 25% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా కొద్ది వరకు పుంజుకున్న థియేటర్స్ కౌంట్ తక్కువే అవ్వడం తో…
అది పూర్తిగా సరిపోలేదు అని చెప్పాలి, అయినా కానీ సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 21 వ రోజు మొత్తం మీద ఇప్పుడు 20 లక్షల నుండి కుదిరితే 24 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…
27 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ కష్టం కాని సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలానే రానున్న మరిన్ని రోజులు కష్టపడితే కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ ని క్రాస్ చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.
ఇక దీపావళి వీకెండ్ లో కొంచం జోరు చూపినా కంప్లీట్ గా రెండు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక మిగిలిన చోట్ల సినిమా కలెక్షన్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లే అని చెప్పొచ్చు. బాక్స్ అఫీస్ దగ్గర సినిమా 3 వారాల టోటల్ కలెక్షన్స్ వివరాలను కొద్ది సేపట్లో అప్ డేట్ చేస్తాం…