రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించి ఇతర సంక్రాంతి సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేసి సంచలన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా…
మూడో వీక్ లో లాస్ట్ రోజు ఇప్పుడు వర్కింగ్ డే గా అవ్వడంతో కలెక్షన్స్ పరంగా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ…ఇప్పటి వరకు సినిమా రన్ ఊహకందని ఊచకోత అనే చెప్పాలి ఇప్పుడు…
ఇక సినిమా 20వ రోజుతో పోల్చితే 21వ రోజున వర్కింగ్ డే లో ఆల్ మోస్ట్ 70-75% రేంజ్ లో డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మాత్రం కొంచం పర్వాలేదు అనిపించేలా ఉండటంతో కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది.
ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 90 లక్షల దాకా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంది. సినిమా అంచనాలను ఏమైనా మించి పోయి…
1 కోటి మార్క్ ని అందుకుంటే అది ఊచకోతే కానీ దానికి ఛాన్స్ ప్రస్తుతానికి చాలా తక్కువగానే ఉంది. దాంతో కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్స్ తో ఇన్ని రోజులు జాతర సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం జోరుకి ఇవాళ బ్రేక్ పడే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 1 కోటి నుండి 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది… ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా సినిమా 3 వారాల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.